సీఎం విజయ్ సంచలన ప్రకటన..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో కీలక సంక్షేమ నిర్ణయాలను ప్రకటించారు. ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు వెల్లడించారు.

24 ఆగస్టు, 2026 11:54 AM•ByNarender Kumar Nangunoori

Share this article

సీఎం విజయ్ సంచలన ప్రకటన..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు

చెన్నై, ఆగస్టు 24 (జనవాణి): తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు

‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. ఈ పథకం పొంగల్ 2027 నుంచి అమల్లోకి రానుంది. సిలిండర్లకు సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఏడాదికి సుమారు రూ.4,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల వరకు ఉన్న కుటుంబాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, చిన్న, సన్నకారు రైతులు తదితరులు అర్హులుగా ఉండనున్నారు.

మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం

‘వెట్రి పయనం’ పథకాన్ని మరింత విస్తరిస్తున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విస్తరించి ఎక్స్‌ప్రెస్, డీలక్స్, లిమిటెడ్ స్టాప్ వంటి సర్వీసుల్లోనూ ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు.

పరందూర్ విమానాశ్రయానికి బ్రేక్

చెన్నై శివార్లలోని పరందూర్‌లో రెండో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను తమ ప్రభుత్వం విరమించుకుంటున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు, స్థానిక ప్రజలకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే చెన్నైకి రెండో విమానాశ్రయం అవసరమని పేర్కొన్న సీఎం.. వ్యవసాయ భూములకు, ప్రజల నివాసాలకు తక్కువ నష్టం కలిగే ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలిస్తామని తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు