WhatsApp New Features: వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్లు..ఇక చాటింగ్‌లోనే ఏఐ సాయం!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం పలు కొత్త AI ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్లతో చాటింగ్ చేస్తూ AI సాయం పొందొచ్చు.

22 ఆగస్టు, 2026 3:21 PM•ByNarender Kumar Nangunoori

Share this article

WhatsApp New Features: వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్లు..ఇక చాటింగ్‌లోనే ఏఐ సాయం!

social media image

WhatsApp New AI Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో AI వినియోగం మరింత సులభతరం కానుంది. యూజర్లకు మెరుగైన చాటింగ్ అనుభూతిని అందించేందుకు పలు AI ఫీచర్లను తీసుకొచ్చింది. వీటి ద్వారా చాటింగ్ చేస్తూనే అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు, క్రియేటివ్ కంటెంట్‌ను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.

చాటింగ్‌లోనే AI సాయం

పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌లో ఉన్నప్పుడే AI సాయం పొందొచ్చు. ఇందుకోసం @Meta AIని ట్యాగ్ చేసి ప్రశ్న అడిగితే సమాధానం లభిస్తుంది. ఉదాహరణకు గ్రూప్‌లో వినాయక చవితి గురించి చర్చ జరుగుతున్నప్పుడు.. వినాయక చవితి తేదీ ఎప్పుడో @Meta AIని అడిగి వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే గ్రూప్‌లో మిస్ అయిన మెసేజ్‌ల సారాంశాన్ని కూడా AI ద్వారా పొందే అవకాశం ఉంది.

ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో AIతో ఇమేజ్‌లు, స్టిక్కర్లు క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. మనకు కావాల్సిన చిత్రాన్ని టెక్స్ట్ రూపంలో వివరించగానే AI దాన్ని రూపొందిస్తుంది. వివిధ మూడ్స్‌కు అనుగుణంగా ప్రత్యేక స్టిక్కర్లను కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రొఫైల్ ఫొటోలను AI సాయంతో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది.

ఫొటోలోని వస్తువులపై సమాచారం

వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటోలను AI విశ్లేషించగలదు. ఫొటోలో కనిపిస్తున్న వస్తువులు, ప్రదేశాల గురించి సమాచారం అడిగితే సమాధానం ఇస్తుంది. అవసరమైతే ఫొటోలోని కొన్ని వస్తువులను తొలగించమని టెక్స్ట్ కమాండ్ ఇవ్వవచ్చు. దీంతో ప్రత్యేక ఫొటో ఎడిటింగ్ టూల్స్ అవసరం లేకుండానే కొన్ని మార్పులు చేసుకోవచ్చు.

ప్రైవసీ కోసం ప్రైవేట్ చాట్ మోడ్

AIతో చేసే సంభాషణల గోప్యత కోసం వాట్సాప్ ప్రైవేట్ చాట్ మోడ్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా AI చాట్‌లను ఇతరులకు తెలియకుండా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్లు వాట్సాప్ యాప్, వెబ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని AI ఫీచర్లు ప్రాంతాన్ని బట్టి దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు