సాగునీరు లేక ఎండిన పంటలు.. రైతుల కన్నీళ్లు: ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సిత్య తండాలో సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. SRSP కాలువ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా నిరసన చేపట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

17 ఆగస్టు, 2026 4:25 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సాగునీరు లేక ఎండిన పంటలు.. రైతుల కన్నీళ్లు: ఎర్రబెల్లి దయాకర్ రావు

Janavaani

వరంగల్ జిల్లా, ఆగస్టు 17 (జనవాణి): సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సిత్య తండాలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు.

ఓ రైతు పొలంలోని బోరు, పక్కనే ఉన్న చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన ఎర్రబెల్లి.. సాగునీరు అందక ఎండిపోయిన నారు మడిని చూసి ఆవేదనకు గురయ్యారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సమయానికి రైతుబంధు, ఎరువులు, విద్యుత్, సాగునీరు అందడంతో మూడు పంటలు పండించామని రైతులు తెలిపారు. దీనిపై ఎర్రబెల్లి స్పందిస్తూ.. రైతులను కంటికి రెప్పలా కాపాడిన గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు.

అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలోని రామోజీ కుమ్మరిగూడెం తండా వద్ద SRSP ప్రధాన కాలువలో దిగి రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి SRSP కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు