సాగునీరు విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు

దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేపట్టిన కాలువ బాట ఉద్రిక్తంగా మారింది. సింగరాజుపల్లి గ్రామంలో ధర్నాకు దిగిన ఎర్రబెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

20 ఆగస్టు, 2026 12:48 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సాగునీరు విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు

జనగామ జిల్లా, ఆగస్టు 20 (జనవాణి): దేవరుప్పుల, కొడకండ్ల మండలాల రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేపట్టిన కాలువ బాట ఉద్రిక్తతకు దారితీసింది. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఆయన అనుచరులు, కార్యకర్తలతో కలిసి సింగరాజుపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు సింగరాజుపల్లిలో ధర్నా చేపట్టారు. దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎర్రబెల్లి ఆందోళనను అడ్డుకున్నారు. అనంతరం ధర్నా చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాగునీటి సమస్య పరిష్కారం కోసం రైతుల తరఫున తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎర్రబెల్లి వర్గం పేర్కొంది. ఆయన అరెస్టుతో సింగరాజుపల్లి గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు