నేపాల్‌లో మరోసారి వరద ముప్పు ఆందోళన కలిగిస్తోంది. దార్చులా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడి మట్టి, రాళ్లు చౌలాని నదిలోకి జారిపడటంతో నదీ ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. నది పూర్తిగా మూసుకుపోతే దిగువ ప్రాంతాల్లో ఆకస్మికంగా భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
నేపాల్‌లో మరోసారి భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం త్రిశూలీ నది ఉగ్రరూపం దాల్చడంతో ధాదింగ్, గూర్ఖా జిల్లాలను కలిపే కీలక సస్పెన్షన్ బ్రిడ్జి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరోవైపు అప్పర్ త్రిశూలీ-3ఏ ప్రాజెక్టు వద్ద నీటిమట్టం భారీగా పెరగడంతో సహాయక, రికవరీ చర్యలకు అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రసువా జిల్లాలో భోటేకోషి నది ఉప్పొంగడంతో భారీగా వరద నీరు దిగువ ప్రాంతాల్లోకి చేరింది. తాజా సమాచారం ప్రకారం 28 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు త్రిశూలి నది కూడా ఉప్పొంగడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో చమోలీ జిల్లాలోని తమక్ నాలా ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ ఆకస్మిక వరద ధాటికి మలారి–నితి మార్గంలోని కీలక బైలీ బ్రిడ్జి కొట్టుకుపోయింది.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 53 అడుగులు దాటిన నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.