నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు.. 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతు

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రసువా జిల్లాలో భోటేకోషి నది ఉప్పొంగడంతో భారీగా వరద నీరు దిగువ ప్రాంతాల్లోకి చేరింది. తాజా సమాచారం ప్రకారం 28 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు త్రిశూలి నది కూడా ఉప్పొంగడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

26 ఆగస్టు, 2026 5:39 PM•ByVijay Kumar

Share this article

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు.. 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతు

నేపాల్‌ కాఠ్మాండు August 26(జనవాణి): నేపాల్‌లోని రసువా జిల్లాలో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. టిబెట్ వైపు నుంచి భోటేకోషి నది ద్వారా భారీగా వరద నీరు ప్రవేశించడంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. వరద ప్రవాహంతో పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు కొట్టుకొచ్చినట్లు సమాచారం.

28 మంది భద్రతా సిబ్బంది గల్లంతు

భారీ వరదల కారణంగా 28 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (APF) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

త్రిశూలి నది ఉప్పొంగడంతో..

భోటేకోషి నది నుంచి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతాల్లోకి చేరడంతో త్రిశూలి నది కూడా ఉప్పొంగింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

వరదకు కారణమేంటి?

భారీ ఆకస్మిక వరదకు ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. టిబెట్ వైపు నుంచి అకస్మాత్తుగా భారీగా వరద ప్రవాహం రావడానికి గ్లేసియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ (GLOF) కారణమై ఉండొచ్చని అధికారులు, హైడ్రాలజిస్టులు పరిశీలిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

భారీ వరదల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన భద్రతా సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు