హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. టస్కర్ ముందు దానం నాగేందర్ కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర మాత్రం బాహుబలి క్రేన్‌లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. సమస్యను పరిష్కరించిన అనంతరం మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చి శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్ 23 బుధవారం రాత్రి వరకే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. సెప్టెంబర్ 24న షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు చేపట్టి.. 25న తెల్లవారుజామున మహాగణపతి శోభాయాత్ర నిర్వహించనున్నారు.
వరంగల్ శివనగర్ వాసవికాలనీలోని వినాయక ట్రస్టు భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి గణపతిని ఏకంగా రూ.1.93 కోట్ల విలువైన వివిధ రంగుల కరెన్సీ నోట్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది రూ.1.51 కోట్ల కరెన్సీతో అలంకరించగా.. ఈసారి మరో రూ.42 లక్షల విలువైన నోట్లను అదనంగా వినియోగించారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి గణేశ్ ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో 'పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరిన బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంకష్టి చతుర్థి రోజు చంద్రుడిని దర్శించడం, గణేశుడికి 21 దూర్వా ఆకులు, మోదకం సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాస కథను వినడం వల్ల జీవితంలో కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి.