గోదావరి జిల్లాల్లో ఎంతో క్రేజ్ ఉన్న పులస చేప మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు చిక్కిన కేజీన్నర బరువున్న పులసను యానాం మార్కెట్‌లో రూ.20 వేలకు కొనుగోలు చేసి, ఓ వ్యక్తి చిరంజీవికి బహుమతిగా పంపించినట్లు మత్స్యకారులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తణుకుకు చెందిన ఓ కుటుంబం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో మహిళను స్థానిక మత్స్యకారులు రక్షించగా.. ఆమె భర్త, కుమారుడు, కుమార్తె గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు, బోట్ల సాయంతో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం ఉద్ధృతంగా మారింది. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా పాపికొండల విహారయాత్రను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
గోదావరి పుష్కరాలు-2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, ట్రాఫిక్, సీసీ కెమెరాలు, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు ఉన్నా రైతులకు అందించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు నెలలు ఇరిగేషన్ శాఖ తనకు అప్పగిస్తే పరిస్థితి మార్చి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.