మెగాస్టార్ ఇంటికి గోదావరి పులస..అభిమాన హీరో కోసం స్పెషల్ గిఫ్ట్!

గోదావరి జిల్లాల్లో ఎంతో క్రేజ్ ఉన్న పులస చేప మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు చిక్కిన కేజీన్నర బరువున్న పులసను యానాం మార్కెట్‌లో రూ.20 వేలకు కొనుగోలు చేసి, ఓ వ్యక్తి చిరంజీవికి బహుమతిగా పంపించినట్లు మత్స్యకారులు తెలిపారు.

9 సెప్టెంబర్, 2026 1:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మెగాస్టార్ ఇంటికి గోదావరి పులస..అభిమాన హీరో కోసం స్పెషల్ గిఫ్ట్!

గోదావరి పులసకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుస్తెలమ్మైనా పులస తినాలి’' అనే నానుడితోనే ఈ చేపకు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. తాజాగా అరుదైన పులస చేప మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరడం ఆసక్తికరంగా మారింది.

కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు సుమారు కేజీన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీనిని యానాం మార్కెట్‌లో వేలం వేయగా రూ.20 వేల ధర పలికింది. జి.వి. అనే వ్యక్తి రూ.20 వేలు చెల్లించి ఈ పులసను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మరో వ్యక్తి సహాయంతో ఈ అరుదైన చేపను మెగాస్టార్ చిరంజీవికి గిఫ్ట్‌గా పంపించినట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో ఈ వార్త స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తగ్గని పులస క్రేజ్

గోదావరి జిల్లాల ప్రజలకు పులస చేప అంటే ప్రత్యేకమైన అభిమానం. సీజన్‌లో పులస దొరికితే ధర ఎంత ఉన్నా కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న బంధువులకు సైతం పులసను పంపించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా పులస చేపలు అరుదుగా లభిస్తుండటంతో వాటికి వేల రూపాయల ధర పలుకుతోంది. దీంతో స్థానికులు, మత్స్యకారులు ‘పులస మజాకానా’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పులస చేరడంతో ఈ ప్రత్యేకమైన చేపపై మరోసారి చర్చ మొదలైంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు