హైదరాబాద్ పహాడీషరీఫ్ పరిధిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.25,500 జరిమానాతో పాటు బాధితుడికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఓటీ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో జింక మాంసం పట్టుబడింది. సుమారు 13 కిలోల జింక మాంసాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వేటకు ఉపయోగించిన రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో స్నేహితులే వసీం అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలోనూ ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు సమాచారం.
గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14ను పనిదినంగా నిర్ణయించింది.
కేటీఆర్ జల ఉద్యమం చేస్తామని చెప్పడం విడ్డూరమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు జల సమాధి చేశారని విమర్శించారు.