వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ వ్యవస్థాపకుడు వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న తనకు ఇన్సులిన్ ఆపేయాలని సూచించారని, ఆ తర్వాత డయాబెటిక్ కీటోయాసిడోసిస్, తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇన్నోవా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన బిహార్‌కు చెందిన నందులాల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో కారు ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరువు సీమగా పేరొందిన అనంతపురం జిల్లాకు భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. పవన విద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థ సుజ్లాన్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి ఉపాధి.
హైదరాబాద్ భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్ రూ.1,386 కోట్లకు విక్రయమై.. నగర భూముల ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది.
రాయదుర్గం PM ఏక్తా మాల్ ప్రాజెక్టులో ప్రభుత్వ భూమి, కేంద్ర నిధుల వినియోగం, టెండర్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. టెండర్లు రద్దు చేసి సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.