హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు నగరంలో ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరానికి నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది.
శంషాబాద్‌లో ఆర్టీసీ బస్సులో తనకు చేదు అనుభవం ఎదురైందంటూ ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. మదన్‌పల్లి తండా వద్ద దిగేందుకు టికెట్ తీసుకున్నానని, అయితే బస్సు అక్కడ ఆపకుండా కొత్తూరు వద్ద నిలిపారని ఆమె తెలిపింది.
హైదరాబాద్ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టే అంశంపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌లో పాస్‌ల విధానం అమలు సాధ్యం కాదని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ అభిప్రాయపడినట్లు సమాచారం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రోడ్లను మూసివేయడంతో పాటు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.