సంచలన ఆఫర్‌ను ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. రూపాయికే సిమ్‌.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!

BSNL Offer | ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్‌ ధరలను పెంచుతున్న వేళ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మరోసారి సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్‌ 2.0’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

18 ఆగస్టు, 2026 10:20 AM•ByPradeep

Share this article

సంచలన ఆఫర్‌ను ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. రూపాయికే సిమ్‌.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!

సంచలన ఆఫర్‌ను ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. రూపాయికే సిమ్‌.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!

BSNL Offer | ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్‌ ధరలను పెంచుతున్న వేళ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మరోసారి సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్‌ 2.0’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్త కనెక్షన్‌ తీసుకునే వారికి కేవలం రూ.1కే సిమ్‌తో పాటు 24 రోజుల పాటు పలు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 12 వరకు అందుబాటులో ఉండనుంది. ‘ఫ్రీడమ్‌ 2.0’ ఆఫర్‌లో భాగంగా కొత్త వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం లభిస్తుంది. దీని కాలపరిమితి 24 రోజులు ఉంటుంది. దీంతోపాటు రోజుకు వన్‌ జీబీ హైస్పీడ్‌ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. ప్రస్తుత రీఛార్జ్‌ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మొబైల్‌ సేవలు పొందాలనుకునే వారికి ఈ ఆఫర్‌ ఆకర్షణీయంగా మారింది.

నిబంధనలు వర్తిస్తాయ్‌..

ఈ ప్రత్యేక ఆఫర్‌ కొత్త కనెక్షన్‌ యాక్టివేషన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగిస్తున్న వారు తమ పాత నంబర్‌పై రూ.1 ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకునే అవకాశం లేదు. రెండో నంబర్‌గా తక్కువ ఖర్చుతో సిమ్‌ను వినియోగించాలనుకునేవారికి, తమ ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సేవలను పరీక్షించాలనుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు. ఆఫర్‌ను పొందాలనుకునే వారు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌, అధికారిక మొబైల్‌ రిటైలర్‌ను సంప్రదించి కొత్త సిమ్‌ తీసుకోవాలి. కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసిన అనంతరం ‘ఫ్రీడమ్‌ 2.0’ ఆఫర్‌ కింద నంబర్‌ను యాక్టివేట్‌ చేస్తారు. అయితే టెలికాం సర్కిల్‌ను బట్టి ఆఫర్‌ నిబంధనల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నందున.. సిమ్‌ తీసుకునే ముందు సంబంధిత రిటైలర్‌ వద్ద వివరాలు తెలుసుకోవడం మంచిది.

గతంలోనూ ఇదే తరహా ఆఫర్‌

కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి తక్కువ ధర ఆఫర్లను గతంలోనూ ప్రకటించింది. 2025 అక్టోబరులో దీపావళి సందర్భంగా రూ.1 ప్లాన్‌ను తీసుకొచ్చింది. వినియోగదారుల నుంచి స్పందన రావడంతో 2026 ఏప్రిల్‌లో పరిమిత కాలానికి మరోసారి అందుబాటులోకి తెచ్చింది. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి ప్రైవేటు సంస్థలతో పోటీపడుతున్న నేపథ్యంలో.. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ వినూత్న ఆఫర్లను ప్రకటిస్తోంది.

P

Written By

Pradeep

Reporter

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు