చమురు ధరల మంట.. రూపాయిపై ఒత్తిడి

Rupee | అంతర్జాతీయ అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరలు రూపాయిపై నిరంతరం ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్‌ ఘర్షణ మొదలైనప్పటి నుంచి డాలర్‌తో రూపాయి విలువ సుమారు నాలుగు శాతం పతనమైంది. ముడిచమురు ధరలు మరింత పెరిగితే రూపాయి 97కు, ఆ తర్వాత 99 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని బీఎంఐ అంచనా వేసింది.

18 ఆగస్టు, 2026 8:54 AM•ByPradeep

Share this article

చమురు ధరల మంట.. రూపాయిపై ఒత్తిడి

చమురు ధరల మంట.. రూపాయిపై ఒత్తిడి

Rupee | అంతర్జాతీయ అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరలు రూపాయిపై నిరంతరం ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్‌ ఘర్షణ మొదలైనప్పటి నుంచి డాలర్‌తో రూపాయి విలువ సుమారు నాలుగు శాతం పతనమైంది. ముడిచమురు ధరలు మరింత పెరిగితే రూపాయి 97కు, ఆ తర్వాత 99 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని బీఎంఐ అంచనా వేసింది. భారత్‌ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగిన ప్రతిసారీ చమురు కొనుగోళ్లకు భారత్‌ మరిన్ని డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్‌ పెరిగి రూపాయిపై ఒత్తిడి ఎక్కువవుతోంది. అమెరికా–ఇరాన్‌ ఘర్షణ కొనసాగితే బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఈ ఒత్తిడి తీవ్రం కావచ్చని బీఎంఐ పేర్కొంది.

ఎల్‌నినోతో మరో ముప్పు

వాతావరణ పరిస్థితులు కూడా రూపాయి స్థిరత్వానికి సవాల్‌గా మారే అవకాశం ఉంది. సూపర్‌ ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు దాదాపు మూడింట రెండొంతులుగా ఉన్నాయని వాతావరణ నిపుణుల అంచనా. దీని ప్రభావంతో వ్యవసాయ ఉత్పత్తి, ఎగుమతులు దెబ్బతినడంతో పాటు ఆహార దిగుమతుల అవసరం పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో తగినంత ఆహార నిల్వలు ఉన్నాయని అంచనా. మరోవైపు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందన్న అమెరికా హెచ్చరికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక సుంకాలు అమల్లోకి వస్తే భారత ఎగుమతులపై ప్రభావం పడటంతో పాటు విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ చర్యలతో కొంత ఉపశమనం

విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు రూపాయి పతనాన్ని కొంతమేర అడ్డుకోగలవని బీఎంఐ అభిప్రాయపడింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగి, ఇంధన ధరలు మరింత ఎగబాకితే రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని తెలిపింది. అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌ కావడంతో అక్కడి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల వ్యయం, ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది.

19 పైసల పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బలహీనత, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో సోమవారం రూపాయి 19 పైసలు క్షీణించి డాలర్‌కు రూ.95.61 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ విదేశీ మారక మార్కెట్‌లో రూ.95.50 వద్ద ప్రారంభమైన రూపాయి.. రోజంతా రూ.95.49–95.62 మధ్య కదలాడింది. గత శుక్రవారం డాలర్‌తో రూపాయి మూడు పైసలు బలపడి రూ.95.42 వద్ద ముగిసింది. ప్రస్తుత స్థాయి నుంచి రూ.97, ఆపై రూ.99 వరకు క్షీణించే అవకాశం ఉందన్న అంచనాలు రూపాయికి ముందున్న సవాళ్ల తీవ్రతను సూచిస్తున్నాయి.

P

Written By

Pradeep

Reporter

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు