రవితేజ ‘ఇరుముడి’ కథ ఇదే.. శబరిమలతో సంబంధం లేదన్న డైరెక్టర్

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా శబరిమల నేపథ్యంలో తెరకెక్కలేదని దర్శకుడు స్పష్టం చేశారు.

11 ఆగస్టు, 2026 6:55 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రవితేజ ‘ఇరుముడి’ కథ ఇదే.. శబరిమలతో సంబంధం లేదన్న డైరెక్టర్

Social Media Image

హైదరాబాద్,ఆగస్టు 11(జనవాణి): మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే సినిమాలో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడం, అయ్యప్ప భక్తికి సంబంధించిన పాటలు ఉండటంతో ఇది శబరిమల నేపథ్యంలో తెరకెక్కిన కథ అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

శబరిమలతో సంబంధం లేదు

ఈ ప్రచారానికి దర్శకుడు శివ నిర్వాణ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ‘ఇరుముడి’ కథకు శబరిమల ఆలయంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఒక ముఖ్యమైన భాగం మాత్రమేనని తెలిపారు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకోవాల్సి వస్తుంది. దీక్ష సమయంలో కఠినమైన నియమాలు పాటించాల్సి ఉండటంతో మద్యానికి అలవాటుపడిన ఆ వ్యక్తి ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడనేదే కథలోని ప్రధాన అంశమని శివ నిర్వాణ వెల్లడించారు. కఠినమైన నియమాలు ఉండాలి కాబట్టే నేను అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అంతే తప్ప ఇది శబరిమలకు సంబంధించిన కథ కాదు.

‘ఇరుముడి’ సినిమా దర్శకుడు శివ నిర్వాణ

41 రోజులే కథకు కీలకం

దీక్షకు ముందు హీరో జీవితంలో ఏం జరిగింది, దీక్ష సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, దీక్ష తర్వాత అతని జీవితం ఎలా మారింది అనే అంశాల చుట్టూ కథ సాగుతుందని దర్శకుడు తెలిపారు. తండ్రీకూతుళ్ల మధ్య భావోద్వేగ బంధం కూడా సినిమాలో కీలకంగా ఉంటుందని చెప్పారు. కఠినమైన దీక్షా నియమాల నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలు, సంఘర్షణ, థ్రిల్లింగ్ అంశాలను మిళితం చేసినట్లు వెల్లడించారు.

ఫ్యామిలీ డ్రామా.. మిస్టరీ థ్రిల్లర్

‘ఇరుముడి’ ప్రాథమికంగా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయని శివ నిర్వాణ తెలిపారు. సినిమా ఒక దశలో మిస్టరీ థ్రిల్లర్ తరహా అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. రెగ్యులర్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాలకు భిన్నంగా ‘ఇరుముడి’ ఉంటుందని తెలిపారు. ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగించేలా సినిమా సాగుతుందని చెప్పారు. భయం, టెన్షన్, భావోద్వేగాలు, కుటుంబ బంధాలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు