సాయి పల్లవి రికార్డు రెమ్యూనరేషన్.. బాబోయ్ సీతమ్మ పాత్ర కోసం అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్‌కు అతీతంగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రామాయణ సినిమా చేస్తుంది. ఈ మూవీలో సాయి పల్లవి సీతమ్మ పాత్రలో నటిస్తుంది.

29 జులై, 2026 9:59 AM•ByLaharika

Share this article

సాయి పల్లవి రికార్డు రెమ్యూనరేషన్.. బాబోయ్ సీతమ్మ పాత్ర కోసం అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటుందా?

సాయి పల్లవి.. ఈ పేరుకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అసలు సాయి పల్లవి సినిమా చేసిందంటే హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు పరుగులు తీస్తారు. అంతటి అభిమానగళాన్ని సంపాదించుకుంది ఈ నటి. అంతెందుకు లెక్కల మాస్టర్ సుకుమార్ సైతం ఆమె క్రేజ్ చూసి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చాడంటే ఈ అమ్మడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకించి చెప్పనవరం లేదు.

అలా అని సాయి పల్లవి వందేసి కోట్ల సినిమాలు చేయలేదు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేయలేదు. కానీ.. గ్లామర్‌కు అతీతంగా పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం వల్ల ఆమెకు ఈ రేంజ్‌లో పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో 'రామాయణ' ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతమ్మ పాత్రలో నటిస్తుంది.

రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే లీకైన ఫోటోలు.. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ ఈ సినిమాపై మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. అసలు ఎప్పుడెప్పుడు వెండితెరపై ఈ అద్భుత దృష్య కావ్యాన్ని చూద్దామా అని యావత్ ఇండియన్ సినిమా లవర్స్ వేయిట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతుంది.

అదేంటంటే.. ఈ సినిమా సాయి పల్లవి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సాయి పల్లవి ఈ సినిమా కోసం అక్షరాల రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతుందట. ఇప్పటి వరకు సాయి పల్లవి ఒక్కో సినిమా రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా.. ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు తీసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఈ సినిమా మూడు పార్టు‌లుగా తెరకెక్కనుంది. కాగా, ఈ మూడు పార్టులకు కలిపి రూ.20 కోట్లు తీసుకుందట. దానికి తోడు ఈ సినిమాకు సాయి పల్లవి బల్క్ డేట్స్ ఇచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే రూ.20 కోట్లు భారీ పారితోషికం ఏం కాదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ నవంబర్‌లో రిలీజ్ కాబోతుంది. దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ రామాయణ సిరీస్‌లో కేజీఎఫ్ హీరో యష్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు