ఊరమాస్ యాక్షన్‌తో నాని విజృంభణ..'ది ప్యారడైజ్' టీజర్ అదుర్స్!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం ది ప్యారడైజ్. ఈరోజు విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

6 ఆగస్టు, 2026 9:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఊరమాస్ యాక్షన్‌తో నాని విజృంభణ..'ది ప్యారడైజ్' టీజర్ అదుర్స్!

Nani Instagram

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ది ప్యారడైజ్ (The Paradise) కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ నుండి వస్తున్న రెండవ ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన 'జడల్ జమానా' టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సుమారు 1 నిమిషం 43 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం డార్క్ టోన్, రా యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో, ఊరమాస్ యాక్షన్ విజువల్స్‌తో ఆకట్టుకుంది.

టీజర్‌లో 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నాని షర్ట్‌లెస్, రగ్డ్ అవతారంలో కనిపించి అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాడు. హక్కుల కోసం పోరాడే నాయకుడిగా, తన జాతిని తక్కువగా చూసేవారిపై యుద్ధం ప్రకటించే వ్యక్తిగా ఆయన పాత్రను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించారు.

టీజర్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలిచింది. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలకు ఆయన మ్యూజిక్ టీజర్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. మోహన్ బాబు డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా, చివర్లో నాని చెప్పిన ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... డైలాగ్‌తో పాటు రక్తంతో దిష్టి తీయడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఎన్నో వాయిదాల అనంతరం 'ది ప్యారడైజ్' చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌కు వస్తున్న అద్భుత స్పందనతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు