తెలంగాణ జానపదం డల్లాస్ వేదికపై మారుమోగింది. తెలుగు సినిమాల్లో తెలంగాణ పల్లె పాటలకు పెరుగుతున్న ఆదరణకు మరో ఉదాహరణగా నాని ‘ది ప్యారడైజ్’ సినిమా నిలుస్తోంది. ఈ సినిమాలోని ‘ఏషనాగుల కట్టమీద’ జానపద గీతం ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్ అవుతోంది.
‘ఏషనాగుల’ పాటకు నాని మాస్ స్టెప్పులు
‘ది ప్యారడైజ్’ కోసం తెలంగాణకు చెందిన ఫేమస్ జానపద గీతం ‘ఏషనాగుల కట్టమీద’ను రీమిక్స్ చేశారు. తెలంగాణ ఫోక్ సింగర్ జంగిరెడ్డితో కలిసి రామ్ మిరియాల, ప్రభ ఈ పాటను ఆలపించారు. అనిరుధ్ సంగీతం అందించారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని కూడా పాల్గొన్నారు. అనిరుధ్‌తో కలిసి ‘ఏషనాగుల’ పాటకు నాని డ్యాన్స్ చేయడంతో అక్కడి మ్యూజిక్ లవర్స్‌లో ఉత్సాహం నెలకొంది. ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కీర్తి సురేష్‌తో నాని స్టెప్పులు
‘ఏషనాగుల’ పాటకు సినిమాలో నానితో కలిసి కీర్తి సురేష్ స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది. ఈ పాటకు ఆట సందీప్ కొరియోగ్రఫీ అందించారు. త్వరలోనే వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఇక ‘ది ప్యారడైజ్’లోని ఫస్ట్ సింగిల్ ‘ఆయాషేర్’ కూడా తెలంగాణ ఫోక్ సాంగ్ కావడం విశేషం. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది.
సెప్టెంబర్ 25న థియేటర్లలోకి..
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో నాని సరసన కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్‌గా కనిపించనుండగా.. రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రానుంది.




















