క్షుద్రపూజల కోసం వరుస హత్యలు.. నిద్రిస్తున్న వారే టార్గెట్‌!

పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల పేరుతో ఇద్దరిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నరసరావుపేటకు చెందిన నిఖిల్‌.. నిద్రిస్తున్న వారిని బండరాయితో హత్య చేసి, మృతదేహం నుంచి కొన్ని శరీర భాగాలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో 2018లో జరిగిన మరో హత్యలోనూ నిఖిల్‌ ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

6 అక్టోబర్, 2026 12:28 PM•ByNarender Kumar Nangunoori

Share this article

క్షుద్రపూజల కోసం వరుస హత్యలు.. నిద్రిస్తున్న వారే టార్గెట్‌!

నరసరావుపేట, అక్టోబర్ 6 (జనవాణి): పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానవ శరీర భాగాలతో క్షుద్రపూజలు చేస్తే అద్భుత శక్తులు లభిస్తాయనే మూఢనమ్మకంతో ఇద్దరిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నరసరావుపేటకు చెందిన నిఖిల్‌ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

నరసరావుపేటలోని బరంపేటకు చెందిన నిఖిల్‌ జులాయిగా తిరుగుతూ క్షుద్రపూజలపై నమ్మకం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 29న బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌ అండర్‌గ్రౌండ్‌లో నిద్రిస్తున్న గాసి రాజేష్‌పై బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం రాజేష్‌ గుండెపై ఉన్న చర్మంతో పాటు మర్మాంగాలపై ఉన్న వెంట్రుకలను తీసుకెళ్లాడు. ఈ అంశం అనుమానాలకు తావివ్వడంతో సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలించారు. నిఖిల్‌ కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. 2018లో నాగరాజు అనే వ్యక్తి హత్యకు గురైన కేసులోనూ నిఖిల్‌ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పట్లోనూ మృతుడి శరీరం నుంచి ఒక వేలును తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. రెండు హత్యల్లోనూ మృతుల శరీర భాగాలు మాయమవ్వడం, నిందితుడి క్షుద్రపూజలపై ఉన్న నమ్మకం వంటి అంశాలు పోలీసుల అనుమానాలను బలపరిచాయి. నిఖిల్‌ను విచారించడంతో రెండు హత్యలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిఖిల్‌ మానసిక పరిస్థితిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్‌ అడహళ్లి అభినందించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు