Kakatiya University | కాకతీయ యూనివర్సిటీ వీసీకి గుండెపోటు.. 'పెద్ది'ని కాపాడిన రోహిణి ఆస్పత్రికి తరలింపు

కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కర్నాటి ప్రతాప్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు.

28 జులై, 2026 7:27 PM•ByRamchandram

Share this article

Kakatiya University | కాకతీయ యూనివర్సిటీ వీసీకి గుండెపోటు.. 'పెద్ది'ని కాపాడిన రోహిణి ఆస్పత్రికి తరలింపు

కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కర్నాటి ప్రతాప్ రెడ్డి( ఫైల్ ఫొటో)

Kakatiya University | కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కర్నాటి ప్రతాప్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రతాప్ రెడ్డికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మంగళవారం ఉదయం స్టెంట్ అమర్చారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వీసీ ప్రతాప్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న డాక్టర్ కె.బుచ్చిరెడ్డి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, ఈసీజీలో హెచ్చుతగ్గులు ఉండటంతో వెంటనే హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పలు పరీక్షల అనంతరం గుండెకు కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మంగళవారం ఉదయం డాక్టర్ బుచ్చిరెడ్డి వైద్య బృందం ఆధ్వర్యంలో స్టెంట్ అమర్చారు.

ప్రస్తుతం వీసీ ఆరోగ్యం నిలకడగా ఉందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం వీసీ ఐసీయూలో ఉన్నారని.. ఆయన్ను పరామర్శించేందుకు వచ్చి ఇబ్బంది పెట్టవద్దని కోరారు. కాగా, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్తే ఇదే రోహిణి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ డాక్టర్ మమతా రెడ్డి 9సార్లు సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు