నా తండ్రి నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై కుమారుడి సంచలన వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తన తండ్రి వల్లే తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

6 ఆగస్టు, 2026 5:53 PM•ByRalin

Share this article

నా తండ్రి నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై కుమారుడి సంచలన వ్యాఖ్యలు

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్, చిత్రంలో శ్రేయాశ్రీ

హైదరాబాద్, ఆగస్టు 6 (జనవాణి) : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తన తండ్రి వల్లే తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తనను, తనకు కాబోయే భార్య, ఆమె కుటుంబాన్ని హత్య చేయించేందుకు కుట్ర జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

తనకు ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని సంతోష్ గౌడ్ తెలిపారు. తనకు ఏదైనా జరిగితే అందుకు తన తండ్రి ప్రకాశ్ గౌడ్, ఆయన అనుచరులే బాధ్య వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. "ప్రాణాల మీద ఆశ వదులుకుని మీడియా ముందుకు వచ్చాను. నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే దారిలో కూడా దాడి జరిగే అవకాశం ఉంది. మీడియాతో మాట్లాడిన తర్వాత నేను బతికి ఉంటానో లేదో తెలియదు" అంటూ సంతోష్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జూలై 8న మా నిశ్చితార్థం జరిగింది: సంతోష్

మణికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కుమార్తె శ్రేయాశ్రీని తాను ప్రేమిస్తున్నానని సంతోష్ గౌడ్ తెలిపారు. జూలై 8న తమ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. ఈ విషయం తమ కుటుంబ సభ్యులకు కూడా తెలుసని, అయితే ప్రేమ వివాహానికి వారు పూర్తిగా అంగీకరించలేదని పేర్కొన్నారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత నుంచి తాను శ్రేయాశ్రీ కుటుంబ సభ్యుల ఇంట్లోనే నెల రోజులుగా ఉంటున్నానని వెల్లడించారు. ఈ క్రమంలో తాము ఉంటున్న ఇంటిపై బుధవారం నాడు సుమారు 40 మంది వచ్చి దాడి చేశారని తెలిపారు. ఈ దాడి వెనుక తన తండ్రి అనుచరులు ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని చెప్పారు. ఇంటిపై దాడికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కాల్ డేటా వివరాలను కూడా అవసరమైతే మీడియాకు అందజేస్తానని చెప్పారు.

దాడి జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినా తమ ఫిర్యాదును సరిగా స్వీకరించలేదని సంతోష్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో నార్సింగి పోలీసులు తమపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి తక్షణ భద్రత కల్పించాలని పోలీసులను కోరారు.

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఆయన కుమారుడే ప్రాణహాని ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రేమ వివాహం అంశంపై తలెత్తిన కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు