బిగ్ బ్రేకింగ్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్‌, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. అందులో ప్రదానమైంది విద్యా శాఖ మంత్రి రాజీనామా.

25 జులై, 2026 4:00 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బిగ్ బ్రేకింగ్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన NEET పోటీ పరీక్ష పేపర్ లీక్ వివాదం, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై తలెత్తిన ఆరోపణలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

NEET ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలకు చర్యలు చేపట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ముసాయిదాలో పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కాలపరిమితిలో విచారణ వంటి కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో తదుపరి విద్యాశాఖ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది.

మరోవైపు.. మంత్రి రాజీనామాతో పాటు నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని, NEET పేపర్ లీక్ పరిణామాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీజేపీ డిమాండ్ చేసినట్లు సమాచారం.

శుక్రవారం జరిగిన రెండో దశ చర్చల్లో ఈ డిమాండ్లలో రెండు అంశాలపై కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ.. విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశంపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. 24 గంటల్లో దీనిపై ప్రకటన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

అయితే.. ఈ రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, రాష్ట్రపతి ఆమోదం, తదుపరి బాధ్యతల కేటాయింపుపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిజమైతే.. NEET పేపర్ లీక్ వివాదంపై కేంద్రం తీసుకున్న అత్యంత కీలక రాజకీయ నిర్ణయంగా ఇది నిలిచే అవకాశం ఉంది. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం, పేపర్ లీక్‌లకు అడ్డుకట్ట, బాధ్యులపై కఠిన చర్యలు.. ఇప్పుడు కేంద్రం ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి. కొత్త విద్యాశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు?
విద్యార్థుల డిమాండ్లలో ఇంకా ఎన్ని నెరవేరనున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు