భారీ యంత్రాలతో ప్రయత్నించినా.. అంగుళం కూడా కదలని హనుమంతుడు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనుల కోసం దాదాపు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఖడే హనుమాన్’ ఆలయాన్ని తొలగించారు. అయితే ఆలయంలోని హనుమంతుడి విగ్రహాన్ని తరలించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు రోజుల పాటు భారీ యంత్రాలతో ప్రయత్నించినా విగ్రహం ఒక్క అంగుళం కూడా కదలకపోవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

11 సెప్టెంబర్, 2026 3:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

భారీ యంత్రాలతో ప్రయత్నించినా.. అంగుళం కూడా కదలని హనుమంతుడు

ఉజ్జయిని, సెప్టెంబర్ 11 (జనవాణి): మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కంఠాల్ చౌరాహా-ఛత్రీ చౌక్ రహదారిపై ఉన్న ప్రాచీన ‘ఖడే హనుమాన్’ ఆలయాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. అయితే ఆలయంలోని హనుమంతుడి విగ్రహాన్ని మాత్రం అక్కడి నుంచి తరలించడం అధికారులకు సాధ్యం కాలేదు.

విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు, సిబ్బంది నాలుగు రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. భారీ యంత్రాలను ఉపయోగించి విగ్రహాన్ని కదిలించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అది ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలకపోవడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

స్థానికుల కథనం ప్రకారం.. కంఠాల్ చౌరాహా-ఛత్రీ చౌక్ రహదారిపై ఉన్న ఈ ‘ఖడే హనుమాన్’ ఆలయానికి సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయాన్ని తొలగించినప్పటికీ హనుమంతుడి విగ్రహాన్ని మాత్రం కదిలించలేకపోవడం భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు