మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహి మసీదులోని కొంత భాగాన్ని తొలగించే చర్య ఉద్రిక్తతకు దారితీసింది. సింహస్థ 2028 ఏర్పాట్లలో భాగంగా రోడ్డు విస్తరణ కోసం అధికారులు చర్యలు చేపట్టగా వాటిని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వడంతో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం (సెప్టెంబర్ 17) భారీ దీపోత్సవం నిర్వహించనున్నారు. క్షిప్రా నది ఘాట్లతో పాటు మహాకాల్ లోక్ ప్రాంతంలో 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది వాలంటీర్లు పాల్గొననుండగా, దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా పలు ప్రజా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనుల కోసం దాదాపు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఖడే హనుమాన్’ ఆలయాన్ని తొలగించారు. అయితే ఆలయంలోని హనుమంతుడి విగ్రహాన్ని తరలించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు రోజుల పాటు భారీ యంత్రాలతో ప్రయత్నించినా విగ్రహం ఒక్క అంగుళం కూడా కదలకపోవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
నాగుల పంచమి వేళ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. బారికేడ్ల కు కరెంట్ షాక్ వచ్చిందన్న తప్పుడు సమాచారంతో భక్తులు ఆందోళన తొక్కిసలాటకు దారి తీసింది
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారుబోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కుంభవృష్టి వర్షాలు, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం పెరిగే అవకాశముందని హెచ్చరించారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన... హైదరాబాద్‌లో బోనాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రోడ్లను మూసివేయడంతో పాటు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి బోనాల ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.