తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 అధ్యాపక, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నారు. అకడమిక్ ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులతో ఎంపిక చేపట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు NCRTC గుడ్‌న్యూస్ చెప్పింది. సూపర్‌వైజర్-I, జూనియర్ మెయింటెయినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలకు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 9, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హత, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ వివరాలు ఇవే.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. SSC JE Recruitment 2026 కింద మొత్తం 1,748 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. వేలాది మంది అభ్యర్థులు తెల్లవారుజామున నుంచే స్టేడియానికి చేరుకోవడంతో తోపులాట జరిగింది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలకు కమర్షియల్ పైలట్‌గా ఎదిగే అరుదైన అవకాశం లభించింది. ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ సంయుక్తంగా 20 నెలల ఉచిత పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) పోలీసు నియామక–2026 ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు.
ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు.
జర్మన్, జపనీస్ తదితర భాషల శిక్షణ కోసం EFLUతో కీలక ఒప్పందం.
తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం.