Saturn Aspect | గ్రహాల రాశి మార్పులు, వాటి దృష్టి ఆధారంగా జ్యోతిష్యంలో వివిధ యోగాలు ఏర్పడుతాయి. గ్రహాల కలయికతో కొన్ని సందర్భాల్లో శుభ యోగాలు, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూల యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే మీనరాశిలో ఉన్నాడు. దీంతో శని ఏడో దృష్టి కన్యారాశిపై పడుతోంది. కన్యారాశిలో ఉన్న సూర్యుడిపై కూడా శని ఏడో దృష్టి పడుతోంది. ఈ గ్రహ స్థితి కారణంగా మూడు రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
కన్యారాశి
సూర్యుడిపై శని దృష్టి కారణంగా కన్యారాశి వారికి కెరీర్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిభారం పెరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కీలకమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం మంచిది.
మీనరాశి
మీనరాశి వారికి రానున్న రోజులు అనుకూలంగా ఉండనున్నాయి. ఉద్యోగంలో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త బాధ్యతలు అప్పగిస్తే వాటి ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మాత్రం ఖర్చులపై దృష్టి పెట్టాలి. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి.
మిథునరాశి
మిథునరాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడి ప్రణాళికల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఓపికగా వ్యవహరిస్తే పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవచ్చు.
సూర్యుడిపై శని ఏడో దృష్టి ఎందుకు?
వేద జ్యోతిష్యంలో సూర్యుడు, శని మధ్య విరోధ సంబంధం ఉన్నట్లు పండితులు చెబుతారు. శని దృష్టిలో ఏడో దృష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శని ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. రాశిచక్రంలో మీనం 12వ రాశి కాగా.. దానికి ఎదురుగా ఉన్న ఏడో రాశి కన్యారాశి. దీంతో మీనంలో ఉన్న శని ఏడో దృష్టి కన్యారాశిపై పడుతుంది. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తుండటంతో శని ఏడో దృష్టి సూర్యుడిపై కూడా ఏర్పడింది. ఈ గ్రహ స్థితి నేపథ్యంలో కన్యా, మీనం, మిథున రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో భిన్నమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.




















