సెప్టెంబర్ 26 నుంచి బుధుడి సంచారం..ఈ 6 రాశులకు ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, నైపుణ్యాలు, వ్యాపారం, సంపాదన, ప్రణాళికలకు కారకుడిగా పరిగణిస్తారు. సెప్టెంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు బుధుడు తులా రాశిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

24 సెప్టెంబర్, 2026 8:57 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సెప్టెంబర్ 26 నుంచి బుధుడి సంచారం..ఈ 6 రాశులకు ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!
  • బుధుడి సంచారం.. ఈ 6 రాశులకు శుభఫలితాలు

బుధుడి రాశి మార్పు జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. బుధుడు తెలివితేటలు, మాటతీరు, నైపుణ్యాలు, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, ప్రణాళికలకు కారకుడిగా భావిస్తారు. సెప్టెంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు బుధుడు తనకు మిత్ర క్షేత్రమైన తులా రాశిలో సంచరించనున్నాడు. ఈ సంచారం ఆరు రాశుల వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మిథున రాశి

మిథున రాశికి అధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపడతాయి. పోటీ పరీక్షలు, పోటీ రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల్లో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుని ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో అవసరమైన మార్పులు చేపట్టి లాభాల బాట పట్టే అవకాశం ఉంది.

కర్కాటక రాశి

బుధుడి సంచారం నాలుగో స్థానంలో ఉండటంతో కుటుంబంలో సుఖసంతోషాలు, మనశ్శాంతి పెరుగుతాయి. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో హోదా, గుర్తింపు పెరగవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి

కన్య రాశికి అధిపతి అయిన బుధుడు ధన స్థానంలో సంచరించడం ఆర్థికంగా అనుకూల ఫలితాలను అందించవచ్చు. చేపట్టిన పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాల పెంపు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. వ్యాపారంలో మార్పులు చేపట్టడం ద్వారా లాభాలు పెరిగే అవకాశం ఉంది.

తుల రాశి

బుధుడు స్వయంగా తుల రాశిలో సంచరించడంతో వ్యక్తిగత, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించవచ్చు. కార్యాలయంలో ప్రతిభ, సామర్థ్యానికి మంచి గుర్తింపు దక్కుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార కార్యకలాపాలు విస్తరించి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి లాభ స్థానంలో బుధుడి సంచారం ఉండటంతో ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పదోన్నతితో పాటు వేతన పెంపు లభించవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందే సూచనలు ఉన్నాయి.

మకర రాశి

మకర రాశికి దశమ స్థానంలో బుధుడి సంచారం ఉండటంతో కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా మెరుగైన ఉద్యోగానికి మారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు రావచ్చు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తిపరంగా పేరు, ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

గమనిక: ఇవి జ్యోతిషశాస్త్ర విశ్వాసాలు, సాధారణ రాశి ఫలితాల ఆధారంగా చెప్పబడినవి. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు