మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27న జరిగిన ED సోదాలకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సోదాల్లో ఏం గుర్తించారు, ఏం స్వాధీనం చేసుకున్నారు, కేసులో ఇప్పటివరకు ఏం పురోగతి సాధించారో వెల్లడించాలని EDని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ED కార్యాలయం వద్ద నోట్ల కట్టలపై పొంగులేటి కూర్చున్నట్లుగా రూపొందించిన కటౌట్‌ను ప్రదర్శించారు. ఇదే అంశంపై కేటీఆర్ కూడా స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ తీరుపై ప్రశ్నలు సంధించారు.
శాసనసభ వద్ద సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఫిర్యాదుల ఆధారంగా కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భద్రతా సిబ్బందిపై దాడి, మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపులు, స్పీకర్‌ను దూషించడం వంటి ఆరోపణలు కేసుల్లో నమోదయ్యాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అసెంబ్లీ వద్ద నిరసన సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకోగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల టీషర్టులపై అసభ్యకర పదాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండటంతోనే వారిని అసెంబ్లీలోకి అనుమతించలేదని తెలిపారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో తన చీర లాగారని, కాలికి గాయమైందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సనత్‌నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు సిద్ధమైన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను హౌస్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాజీపేట రైల్వే డివిజన్ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జంతర్‌మంతర్‌లో ఈ నెల 30న బీఆర్ఎస్ నిర్వహించే ధర్నాకు పార్టీ శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్లనున్నట్లు తెలిపారు.