ముంబైలోని ఓ ప్రముఖ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూర్ మసాలా దోశ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్.. రెండు, మూడు ముద్దలు తిన్న తర్వాత దోశలో చచ్చిన ఎలుక పిల్లను గుర్తించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతడు పోలీసులను ఆశ్రయించి హోటల్‌పై ఫిర్యాదు చేశాడు.
వండిన అన్నాన్ని చల్లార్చి తింటే రెసిస్టెంట్ స్టార్చ్ పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది భోజనం తర్వాత బ్లడ్ షుగర్ పెరుగుదల, గట్ హెల్త్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇది డయాబెటిస్‌కు చికిత్స కాదు. అన్నాన్ని సురక్షితంగా నిల్వ చేయడం కూడా చాలా ముఖ్యం.
Alcohol | ఆహార పదార్థాల్లో కల్తీ గురించి తరచూ వింటుంటాం. కానీ, మద్యంలోనూ కల్తీ జరుగుతోందన్న షాకింగ్ మారింది. పేరున్న మద్యం తయారీ సంస్థలు సైతం అసలు మద్యం తయారీ ప్రక్రియను పక్కనపెట్టి.. కృత్రిమ ఫ్లేవర్లతో ఆల్కహాల్‌ను సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
పాలు లేకుండానే మైదాతో కలాకంద్, మైసూర్ పాక్ తయారు చేస్తున్న ఓ స్వీటు షాపు బండారం బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లను ధ్వంసం చేసి, 1,300 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ ఓల్డ్‌సిటీ మదీనాలోని ప్రముఖ షాదాబ్ కేఫ్‌పై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య లోపాలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం నిల్వ చేయడం, కిచెన్‌లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తుండటాన్ని గుర్తించిన అధికారులు FSSAI లైసెన్స్‌ను రద్దు చేసి కేఫ్‌ను సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. కోళ్ల దుకాణాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి సేకరించిన వ్యర్థాలను రాత్రివేళల్లో లారీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తరలించి చేపల చెరువులకు మేతగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు, పశువైద్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి 13 మసాలా ప్రాసెసింగ్, ట్రేడింగ్ యూనిట్లపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 25 టన్నుల విషపూరిత, రసాయనాలతో కల్తీ చేసిన మసాలా దినుసులను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.