కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘డోరతి’. కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేసింది. కుల, లింగ వివక్ష, పితృస్వామ్య భావజాలం, ట్రాన్స్‌జెండర్ల జీవన సంఘర్షణలను కథలో మేళవించిన ఈ చిత్రం ‘డోరతి’. మరి ఎలా ఉందంటే..
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విజయోత్సాహంలో ఉన్న చిత్రబృందం మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సందర్శించింది. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించింది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డిజైన్ చేసిన స్పెషల్ జాకెట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన ‘ఏషనాగుల కట్టమీద’ తెలంగాణ జానపద గీతం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో ఈ పాటను విడుదల చేయగా.. నాని స్వయంగా పాల్గొని అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయింది. ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించిన చిత్రబృందం.. 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్ కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం చాలా కామన్. హీరోకు కథ నచ్చకపోవడం, డేట్స్ కుదరకపోవడం, ఇతర కారణాలతో ప్రాజెక్టులు చేతులు మారుతుంటాయి. అయితే తాను రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో భారీ హిట్ కొడితే మాత్రం ఆ బాధ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇలాంటి చర్చే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.