మహారాష్ట్రలో సరదాగా సాగాల్సిన విహారయాత్ర విషాదంగా మారింది. పుణెలోని అలందీకి చెందిన విద్యార్థులు రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగార్ బీచ్‌కు పిక్నిక్‌కు వెళ్లగా సముద్రంలో ఈతకు దిగిన 8 మంది విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ముంబైలోని ఓ ప్రముఖ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూర్ మసాలా దోశ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్.. రెండు, మూడు ముద్దలు తిన్న తర్వాత దోశలో చచ్చిన ఎలుక పిల్లను గుర్తించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతడు పోలీసులను ఆశ్రయించి హోటల్‌పై ఫిర్యాదు చేశాడు.
ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు దివంగత కాకా వెంకటస్వామి కన్న కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
నల్ల కాగితాన్ని ప్రత్యేకమైన కెమికల్‌లో ముంచితే అసలైన రూ.500 నోటుగా మారుతుందని నమ్మించిన ఓ ముఠా రాయ్‌పూర్‌కు చెందిన వ్యాపారిని ఏకంగా రూ.1.5 కోట్లకు మోసం చేసింది.
బీజేపీలో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించగా.. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.
ముంబైలోని పవాయ్‌లో ఉన్న ఐఐటీ బాంబే క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతికినట్లు ఆరోపణలు రావడం, అనంతరం క్యాంపస్‌లో ఈ విషయంపై ప్రచారం జరగడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
పాన్ మసాలా ఉత్పత్తిని ప్రకటన ద్వారా ప్రోత్సహించిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై FDA కమిషనర్ తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు కావడం వల్ల చట్టానికి అతీతులు కాదని, నిషేధిత ఉత్పత్తిని ప్రోత్సహించిన వారిపైనా బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని నిఫాడ్ నగర పంచాయత్ కార్యాలయంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శివసేన (యూబీటీ) యువసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కుక్క పిల్లలను సంచుల్లో తీసుకెళ్లి ఏకంగా పంచాయత్ ప్రధాన అధికారి టేబుల్‌పై వదిలారు. అంతేకాకుండా కరెన్సీ నోట్ల దండతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.
దివంగత బాలీవుడ్ నటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తితోపాటు పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల పేర్లు ప్రస్తావించింది.
దానిమ్మ సాగులో వరుస నష్టాలు రావడంతో పంట మార్చాలని నిర్ణయించుకున్న మహారాష్ట్ర యువ రైతు సాగర్ యెల్పలే.. మునగ సాగుతో అద్భుత విజయాన్ని సాధించాడు. తొలుత ఎకరంలో ప్రారంభించిన సాగును 18 ఎకరాలకు విస్తరించి, ప్రస్తుతం ఏడాదికి సుమారు 180-200 టన్నుల మునగ దిగుబడి పొందుతున్నాడు. మునగకాయలు, విత్తనాల విక్రయంతో కలిపి ఏడాదికి రూ.1.15 కోట్ల టర్నోవర్, రూ.80 లక్షలకు పైగా లాభం ఆర్జిస్తున్నాడు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో మాదిరిగా తాను పని చేయలేకపోతున్నానని, బాధ్యతలను యువతరానికి అప్పగించాలని ఆయన చేసిన వ్యాఖ్యలతో యాక్టివ్ పాలిటిక్స్‌కు గడ్కరీ దూరం కానున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశంతో చేసినవి కావని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.
పింప్రి-చించ్‌వాడ్ పోలీసు కమిషనరేట్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ప్రేమ, వివాహ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ ఈ నెల 30న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సెలవు దరఖాస్తుతో పాటు వివాహ ఆహ్వాన పత్రికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం.
మహారాష్ట్రలో వైద్యులపై దాడుల పరంపర ఆందోళన కలిగిస్తోంది. థానేలోని కల్యాణ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్‌పై రోగి కుమారుడు దాడికి పాల్పడ్డాడు. వైద్యుడిని దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలోని టిపేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లోకి పులుల కదలికలు పెరిగాయి. భీంపూర్ మండలం అర్లి గ్రామంలో వ్యవసాయ పొలాల్లో పులి కనిపించగా.. మరో పులి కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అడుగుజాడల ద్వారా గుర్తించారు.
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు కూడా మృతి చెందిన విషాద ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ విషయంలో గొడవ తర్వాత 19 ఏళ్ల కునాల్ కొండపైకి వెళ్లాడు. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు, పోలీసులు అతడిని నచ్చజెప్పారు.
భూమి కొరత, పెరుగుతున్నజనాభా, ఒత్తిడితో సతమతమవుతున్న ముంబైకి ప్రత్యామ్నాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ‘ముంబై 3.0’ను అభివృద్ధి చేయనుంది. రాయ్‌గఢ్ జిల్లాలోని 124 గ్రామాలను కలిపి 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త నగరాన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ కోసం 2026-27లో రూ.4,000 కోట్లు కేటాయించింది.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడికి యత్నం కలకలం రేపింది. గురుద్వారా మెట్ల వద్ద ఓ సేవాదార్ అకస్మాత్తుగా కిర్పాన్‌తో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నిలాభ్ రోహన్ తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
పూణే జిల్లా బరామతి ఎయిర్‌ఫీల్డ్‌లో శిక్షణ విమానం రన్‌వేను దాటి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్, క్యాడెట్ సురక్షితంగా బయటపడగా ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్రతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా, ముంపు ప్రభావం, ప్రాజెక్టు ప్రయోజనాలపై కీలకంగా చర్చించారు.