సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదలైంది. ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. యాక్షన్, వయలెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, భారీ ఎలివేషన్స్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది.
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘డోరతి’. కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేసింది. కుల, లింగ వివక్ష, పితృస్వామ్య భావజాలం, ట్రాన్స్‌జెండర్ల జీవన సంఘర్షణలను కథలో మేళవించిన ఈ చిత్రం ‘డోరతి’. మరి ఎలా ఉందంటే..
సినిమా ప్రమోషన్లు, కమర్షియల్ యాడ్స్‌కు సాధారణంగా దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేసిన ఒక్క నిమిషం యాడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కోసం ఆయనకు ఏకంగా రూ.40 కోట్ల పారితోషికం అందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘బిందాస్’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నోరా ఫతేహి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా రజనీకాంత్ కూడా కాసేపు కనిపించి సందడి చేశారు.
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. 2006లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట.. రెండు దశాబ్దాల తర్వాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జ్యోతిక.. తమ 20 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరితమైన సుదీర్ఘ పోస్ట్ చేశారు.
తమిళనాడు సీఎం, నటుడు విజయ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల సేకరణలో భాగంగా లండన్ వెళ్లిన విజయ్.. అక్కడ జరగనున్న మోటార్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ రేసులో హీరో అజిత్ పాల్గొంటుండగా, హీరోయిన్ త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్, త్రిష మరోసారి ఒకే వేదికపై కనిపిస్తారా అన్న ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్ చేయడం చర్చకు దారితీసిన నేపథ్యంలో నటి సంజన గల్రానీ స్పందించారు. విజయ్ రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలను ఆధారాలు లేకుండా చర్చించడం సరికాదని స్పష్టం చేశారు.
ప్రముఖ సీనియర్ సినీ నటి షావుకారు జానకి అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సీనియర్ హీరోయిన్ నిత్యా మీనన్ సినిమాలకు గుడ్‌బై చెప్పిందంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టబోతున్నారు. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఓ హారర్ ఫాంటసీ మూవీతో సిల్వర్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హీరోయిన్‌గా నటించడంతో పాటు కథను అందిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
దళపతి విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు నమోదు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తొలి నాలుగు రోజుల కలెక్షన్లతో విజయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరే అవకాశంపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా స్టార్ హీరోల మార్కెట్‌పై దాని ప్రభావం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముఖ్యంగా భారీ అభిమాన గణం ఉన్న హీరోల సినిమాలకు తొలి రోజుల్లో వసూళ్లు తగ్గడం చాలా అరుదు. దళపతి విజయ్ నటించిన 'జన నాయకుడు' కూడా అదే కోవలో నిలుస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమాల్లో నటీనటులకు పాత్ర దక్కడం ఎంత ముఖ్యమో.. ఆ పాత్ర చివరి వరకు సినిమాలో ఉండటం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా స్టార్ హీరో సినిమా అయితే ఆ అవకాశాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలనుకుంటారు. కానీ ఏడాది పాటు కష్టపడి నటించిన సన్నివేశాలు చివరికి ఎడిటింగ్‌లో తొలగిపోతే ఎలా ఉంటుంది? ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ తమిళ నటి ఆనంది అజయ్ భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో నాగదుర్గ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఒప్పందాన్ని పాటించలేదంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై తమిళ ఫిల్మ్ ఛాంబర్‌ను కూడా ఆశ్రయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై ధృవ్ విక్రమ్ అధికారికంగా స్పందించలేదు.