మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలో నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో భేటీ అయ్యారు. H-1B వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, స్టాంపింగ్‌ను మరింత సరళతరం చేయాలని కోరడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వీసా అపాయింట్‌మెంట్లు త్వరగా లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ విద్యార్థులకు ఆగస్టులో సెలవుల సందడి నెలకొంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉండగా, ఈ నెలలో మొత్తం 11 రోజుల వరకు హాలిడేస్ ఉండొచ్చు.
న్యూఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసాల పెంపు, H-1B వీసా సౌలభ్యం, అమెరికా పెట్టుబడులు, ఐటీ, AI, ఫార్మా, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యంపై కీలకంగా చర్చించారు.
పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ABVP ఆధ్వర్యంలో జులై 30వ తేదీన హన్మకొండలో తలపెట్టిన స్టూడెంట్ మార్చ్.