నీటి కోసం బకెట్లతో రోడ్డెక్కిన కస్తూర్బా విద్యార్థినులు..హాస్టల్‌లో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్న బాలికలు

పుల్లలచెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నానాలు, మరుగుదొడ్లకు కూడా నీరు అందకపోవడంతో బకెట్లతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

14 ఆగస్టు, 2026 1:08 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నీటి కోసం బకెట్లతో రోడ్డెక్కిన కస్తూర్బా విద్యార్థినులు..హాస్టల్‌లో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్న బాలికలు

మార్కాపురం, ఆగస్టు 14 (జనవాణి): పుల్లలచెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌లో నీటి సమస్య తీవ్రంగా మారింది. నీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరరల్ అవుతున్నాయి.

తాగునీటితో పాటు స్నానాలు, మరుగుదొడ్ల వినియోగానికి కూడా నీరు అందకపోవడంతో విద్యార్థినులు ఖాళీ బకెట్లతో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. హాస్టల్‌లో కనీస అవసరాలకు కూడా నీరు అందడం లేదని, రోజువారీ జీవనం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి హాస్టల్‌కు నిరంతర నీటి సరఫరా అందించాలని విద్యార్థినులు కోరుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటితో పాటు ఇతర అవసరాలకు సరిపడా నీరు అందేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు