నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో నాని జడల్ అనే విభిన్నమైన పాత్రలో కనిపించారు. యాక్షన్‌తో పాటు తల్లి, కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను కూడా కథలో కీలకంగా చూపించినట్లు చిత్రబృందం ప్రమోషన్స్‌లో వెల్లడించింది.
ఈ సినిమాలో నాని తల్లి సమ్మక్క పాత్రను బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి పోషించారు. అయితే సమ్మక్క యంగ్ వెర్షన్‌గా తెరపై కనిపించిన ఓ నటి ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు.
ఆమె పేరు లావణ్య సహుకర. ‘ది ప్యారడైజ్’లో నానికి నేరుగా తల్లిగా లావణ్య నటించలేదు. సోనాలి కులకర్ణి పోషించిన సమ్మక్క పాత్రకు సంబంధించిన యువ వయసు సన్నివేశాల్లో లావణ్య కనిపించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దీంతో సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు.. “ఈ అమ్మాయి ఎవరు?” అంటూ ఆసక్తి చూపిస్తున్నారు.
సమ్మక్క పాత్రకు సినిమాలో భావోద్వేగ ప్రాధాన్యం ఉండటంతో.. ఆమె యంగ్ వెర్షన్‌ను పోషించిన లావణ్యకు కూడా కీలకమైన సన్నివేశాలు దక్కాయి. దీంతో ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే లావణ్య సహుకర తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. 2019లో వచ్చిన ‘ఉండిపోరాదే’ సినిమాతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ‘వాలెంటైన్స్ నైట్’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి చిత్రాల్లో నటించారు.
ముఖ్యంగా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాలో చైతన్య రావుతో కలిసి హీరోయిన్‌గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ‘ముఖ్య గమనిక’ సినిమాలో విరాన్ ముత్తంశెట్టి సరసన కథానాయికగా నటించారు. అదే సమయంలో ‘కాడాది’, ‘సమిధ’ వంటి ప్రాజెక్టుల్లోనూ భాగమయ్యారు. తాజాగా ‘వీరాపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ వంటి ప్రాజెక్టుల్లోనూ కనిపించారు.
ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో సమ్మక్క యంగ్ వెర్షన్‌గా కనిపించడంతో లావణ్య సహుకర మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




















