3400 ప్రేయసి ముద్దులతో కారును నింపిన యువకుడు.. చివరికి పోలీస్ స్టేషన్‌లో కారు

సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నం చివరికి పోలీసుల చర్యకు దారితీసింది. తన ప్రేయసితో స్విఫ్ట్ కారుపై ఏకంగా 3400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు వేయించి రీల్‌ చేయగా.. ఒక్కరోజులోనే 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే, వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో రూ.5,500 జరిమానా చెల్లించడంతోపాటు పోలీస్ స్టేషన్‌లోనే కారు కడగాల్సి వచ్చింది.

25 ఆగస్టు, 2026 2:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

3400 ప్రేయసి ముద్దులతో కారును నింపిన యువకుడు.. చివరికి పోలీస్ స్టేషన్‌లో కారు

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే తాపత్రయంతో యువత చేస్తున్న వినూత్న ప్రయోగాలు కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికార్వార్ కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం చేసిన ఓ ప్రయత్నం చివరికి పోలీసుల చర్యకు దారితీసింది. రీల్‌ను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఆదిత్య తన స్విఫ్ట్ కారును ప్రేయసి లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులతో నింపేశాడు. దాదాపు మూడున్నర గంటలపాటు శ్రమించి ఆమె కారుపై సుమారు 3400 కిస్ మార్కులు వేసింది. ఇందుకోసం దాదాపు రూ.800 నుంచి రూ.900 వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ముద్దుల గుర్తులతో నిండిన కారును వీడియో తీసి ఆదిత్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడు అనుకున్నట్లుగానే వీడియో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే ఈ ‘కిసెస్ కార్’ వీడియోకు 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

అయితే ఈ వైరల్ వీడియో చివరికి ట్రాఫిక్ పోలీసుల దృష్టిని కూడా ఆకర్షించింది. ముద్దుల గుర్తులతో ఉన్న కారు రోడ్లపై తిరుగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు దాని కోసం గాలించారు. చివరకు థాటిపూర్ సమీపంలో కారును గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఆదిత్యకు రూ.5,500 జరిమానా విధించారు. అంతేకాకుండా కారుపై ఉన్న లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులను పోలీస్ స్టేషన్‌లోనే తొలగించాల్సి వచ్చింది. పోలీసుల చర్యతో తన తప్పును తెలుసుకున్న ఆదిత్య.. ఇకపై ఇలాంటి తప్పు చేయబోనని హామీ ఇచ్చాడు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తానని చెప్పడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ప్రయత్నం చివరికి జరిమానా, పోలీస్ స్టేషన్‌లో కారు శుభ్రం చేసుకునే పరిస్థితికి దారితీసింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు