Viral Video: బెంగళూరులో మహిళపై దుండగుల దాడి.. మంగళసూత్రం చోరీ

బెంగళూరులో ఈరోజు ఉదయం ఓ మహిళపై ఇద్దరు దుండగులు దాడి చేసి 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. దొడ్డబిదరకల్లు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

13 ఆగస్టు, 2026 7:43 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Viral Video: బెంగళూరులో మహిళపై దుండగుల దాడి.. మంగళసూత్రం చోరీ

X Image

బెంగళూరు, ఆగస్టు 13 (జనవాణి): బెంగళూరు నగరంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. దొడ్డబిదరకల్లు ప్రాంతంలో ఈరోజు ఉదయం (బుధవారం) పాల దుకాణం మూసుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు టార్గెట్ చేశారు. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. బాధితురాలు విజయమ్మ దొడ్డబిదరకల్లు ప్రాంతంలో పాల దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వెంబడించి ఒక్కసారిగా దాడి చేశారు.

దుండగులు విజయమ్మ మెడలోని మంగళసూత్రాన్ని బలంగా లాగడంతో ఆమె అదుపుతప్పి కిందపడిపోయారు. సహాయం కోసం ఆమె గట్టిగా కేకలు వేసినా, తెల్లవారుజాము కావడంతో సమీపంలో ఎవరూ లేకపోవడంతో వెంటనే స్పందించే వారు కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు