సర్వాయి పాపన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం పాపన్న గౌడ్‌ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

18 ఆగస్టు, 2026 3:28 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సర్వాయి పాపన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Janavaani Image

స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 18 (జనవాణి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతి సందర్భంగా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు, బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ అని అన్నారు. బడుగు వర్గాలను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన పాపన్న గౌడ్‌ చరిత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

దొరలు, పెత్తందార్ల ఆధిపత్యం, అణచివేతకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్‌ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు