మా ఊరికి బస్సు కావాలి.. బాలుడి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి

ప్రజాదర్బార్‌లో ఓ చిన్నారి మా ఊరికి ఆర్టీసీ బస్సు కావాలి అంటూ చేసిన విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

3 ఆగస్టు, 2026 3:29 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మా ఊరికి బస్సు కావాలి.. బాలుడి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి

X (twitter) Image

సత్తుపల్లి, ఆగస్టు 03: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రజాదర్బార్‌లో ఓ చిన్నారి చేసిన వినతి... మంత్రి హృదయాన్ని కదిలించింది. తమ గ్రామమైన ఎర్రబోయినపల్లికి ఆర్టీసీ బస్సు నడపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశాడు. బాలుడి ధైర్యాన్ని, అమాయకంగా చెప్పిన మాటలను చూసి మంత్రి ముచ్చటపడ్డారు. ఏ గ్రామానికి బస్సు కావాలి, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో బాలుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో ఉన్న ఆర్టీసీ అధికారులను వెంటనే పిలిచి ఎర్రబోయినపల్లి గ్రామానికి బస్సు సర్వీస్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీనిపై ఆర్టీసీ అధికారులు ముందుగా సర్వే నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పగా... మంత్రి పొంగులేటి వెంటనే స్పందిస్తూ.. సర్వే అవసరం లేదు... గ్రామానికి బస్సు నడపాల్సిందే. వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అని స్పష్టం చేశారు. అంతేకాదు... బస్సు రాకపోతే తనకు నేరుగా సమాచారం ఇవ్వాలని ఆ బాలుడికి సూచించారు.

ఒక చిన్నారి అభ్యర్థనకు స్పందించి బస్సు వసతి వెంటనే కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి పొంగులేటి తీరు ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటోంది.


Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు