త్వరలోనే భారత్‌లోకి IQOO Z11 స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్ సహా అద్భుత ఫీచర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తన కొత్త IQOO Z11 స్మార్ట్‌ఫోన్‌‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా క్రిప్టిక్ పోస్టుతో సంకేతాలు ఇచ్చింది.

2 ఆగస్టు, 2026 9:19 PM•ByRalin

Share this article

త్వరలోనే భారత్‌లోకి IQOO Z11 స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్ సహా అద్భుత ఫీచర్లు

IQOO Mobiles

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తన కొత్త IQOO Z11 స్మార్ట్‌ఫోన్‌‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా క్రిప్టిక్ పోస్టుతో సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ మొబైల్ విడుదల తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

IQOO కంపెనీ చేసిన పోస్టులో 01011010, 00110001, 00110001 అనే మూడు బైనరీ కోడ్‌లను షేర్ చేసింది. వీటిని డీకోడ్ చేయగా వరుసగా Z, 1, 1 అక్షరాలు రావడంతో iQOO Z11 గురించే ఈ టీజర్ అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, భారత మార్కెట్‌లో విడుదలయ్యే iQOO Z11లో చైనా వెర్షన్‌లో ఉన్న MediaTek Dimensity 8500 స్థానంలో కొత్త MediaTek Dimensity 7500 Turbo ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ చిప్‌సెట్‌తో భారతదేశంలో విడుదలయ్యే తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అయ్యే అవకాశం ఉంది.

డిస్‌ప్లే

భారత్‌లో విడుదలయ్యే ఈ మోడల్‌లో 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. చైనాలో ఇప్పటికే విడుదలైన IZOO Z11 స్మార్ట్‌ఫోన్‌లో 6.89 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 2800*1260 పిక్సెల్ రిజల్యూషన్, 165Hz రీఫ్రెష్ రేట్, HDR సపోర్టు, DCI-P3 కలర్ గామట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా- బ్యాటరీ

చైనాలో విడుదలైన మోడల్‌లో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. మొబైల్ హీట్ కంట్రోల్ చేసేందుకు 7K Ice Dome VC Liquid Cooling సిస్టమ్‌ను అమర్చారు. అలాగే ఈ మొబైల్‌లో 9020mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ కలదు. అలాగే గరిష్టంగా 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

IQOO Z11 విడుదల తేదీ, ధర, కెమెరా చార్జింగ్ కెపాసిటీ వంటి వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. మిడ్ రేంజ్ విభాగంలో ఈ మొబైల్ పోటీని మరింత పెంచే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు