బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
మీ పేరుపై తీసుకున్న సిమ్ కార్డును ఇతరులకు ఇవ్వడం, మీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి తెలియకుండా మొబైల్ కనెక్షన్లు తీసుకోవడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) హెచ్చరించింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది.
హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్ర కలకలం రేపాయి. రుణం చెల్లించలేదని ఓ మహిళను బెదిరించడంతో పాటు.. ఆమె పదో తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పంపించారు. డబ్బు చెల్లించకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ మోసాలపై ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఏపీకే ఫైళ్లు, తెలియని లింకులు, లోన్, వర్క్ ఫ్రం హోం, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వారంలో 38 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి.
పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో నిర్మల్ జిల్లా పోలీసులు మరోసారి సత్ఫలితాలు సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా తాజాగా రికవరీ చేసిన రూ.12.88 లక్షల విలువైన 112 సెల్‌ఫోన్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మంగళవారం బాధితులకు అందజేశారు.
ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫింగ్, ఏఐ ఆధారిత వీడియోలు వైరల్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో మెటా ఇండియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం పెంచుకుని ఒడిశా కార్మికులను బెదిరించి రూ.90 వేలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని యువతకు కీలక సూచనలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు, క్రిప్టో కుంభకోణాలు పెరుగుతున్న నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలకు పాల్పడటంతో పాటు అమాయకులను ఇందులో ఇరికిస్తున్న వారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన 'యాంటీ ఆన్‌లైన్ స్కామ్' బిల్లుకు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది.
హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ గృహాల కేటాయింపు ప్రక్రియ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 'పోలీస్ ప్రజా భరోసా' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ప్రజలకు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు.