విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14న సాయంత్రం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. 14, 15 తేదీల్లో ఆమె విజయవాడలో ఉండనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో కొన్ని తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్ 23 బుధవారం రాత్రి వరకే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. సెప్టెంబర్ 24న షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు చేపట్టి.. 25న తెల్లవారుజామున మహాగణపతి శోభాయాత్ర నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారిని రానున్న డిసెంబర్‌లో దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవలు, వృద్ధులు-దివ్యాంగుల దర్శన టోకెన్లు, తిరుమల-తిరుపతిలో వసతి గదుల కోటా వివరాలు తెలుసుకోండి.
నర్సంపేటలో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఆయన.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
అర్ధరాత్రి 3 గంటలకు విగ్రహం తొలగింపు.. నర్సంపేటలో హైటెన్షన్
1,500 మంది పోలీసుల బందోబస్తు..
కార్యకర్తల అరెస్టులు.. ఆ తర్వాత విగ్రహం తొలగింపు? నర్సంపేటలో ఏం జరిగింది?
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ కారణాలతో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం చుట్టూ ఉద్రిక్తత కొనసాగుతోంది. గద్దె కూల్చివేత తర్వాత బీఆర్ఎస్ నేతలు మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్ద రాత్రంతా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దర్శన్ అనుచరుడు, ఏ-14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామిపై దాడి, మృతి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జరిగిన దశదిన కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కును అందజేశారు.
దివంగత బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. ఇందులో పెద్ది ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు.
తిరుమల శ్రీవారి 2026 వార్షిక పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ద్వారా భక్తులకు ఒకే రోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం చేసుకునే అరుదైన అవకాశం లభించనుంది.
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. A14 నిందితుడు, దర్శన్ సన్నిహితుడిగా చెబుతున్న ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. కేసులో తనకు తెలిసిన పూర్తి నిజాలను వెల్లడిస్తానని పేర్కొనడంతో దర్శన్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశముందనే చర్చ జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం, సంతాప సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రజాసేవలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బతికున్నప్పుడు నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు చనిపోయిన తర్వాత రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీఆర్ఎస్, కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ఉద్యమం కోసం ఏకంగా పెళ్లినే త్యాగం చేసిన నాయకుడు... స్వరాష్ట్రం వచ్చేవరకు బ్రహ్మచర్యం పాటిస్తానని శపథం చేసిన వ్యక్తి... ఉద్యమం గెలిచిన తర్వాతే తిరుమలలో వివాహం చేసుకున్న నాయకుడు... అలాంటి బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. ఆయన మరణంతో తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరు? తెలంగాణ కోసం ఎందుకు అలాంటి శపథం చేశారు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సంతాపం తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం అర్ధరాత్రి 12.50గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భద్రత, వెపన్ లైసెన్స్ రద్దు వ్యవహారంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రత తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేసి, భద్రత కల్పింపుపై అనుసరిస్తున్న ప్రమాణాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం" అంటూ ప్రచారం చేస్తున్న ఎస్సీపీ డెవెలపర్స్ సంస్థకు టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని కలిసి పరామర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు కలిసి ధైర్యం చెప్పడం జరిగింది.
గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. అక్కడ సుదర్శన్ రెడ్డికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం ఏడు గంటలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం సర్వదర్శనం కోసం 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.