ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు, ప్రభుత్వ వైద్య సేవలు, ఓటర్ల జాబితా సవరణ, తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.
సనత్‌నగర్ డా. MCR TIMS ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. అధునాతన సూపర్ స్పెషాలిటీ ప్రబుత్వ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రేపు సనత్‌నగర్‌లో డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్‌పై సమీక్ష నిర్వహించిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ.
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి వారం రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్‌లోని డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రారంభానికి ముందు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వరంగల్‌లో రాష్ట్ర రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ ప్రకటించారు. MGMలో మరో 9 సూపర్ స్పెషాలిటీ సేవలు రానున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో వైద్య విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంతో పాటు, ఆ సంస్థకు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్‌ను, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)గా డాక్టర్ ఎన్. వాణిని నియమిస్తూ జీవోలు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల కోసం జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లో మొత్తం 500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది.
జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఆస్పత్రి భవనం నిర్మాణంతో పాటు జగిత్యాల మెడికల్ కాలేజీలో అన్ని కీలక పీజీ విభాగాలను ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్‌కు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. యువకులు, క్రీడాకారులు, ఉద్యోగులు.. రాజకీయ నాయకులు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా పలువురు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి ఐదు నిమిషాలు అత్యంత కీలకం. ఆ సమయంలో సరైన విధంగా CPR (Cardiopulmonary Resuscitation) చేస్తే బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.