Gold, Silver Prices Today | సెప్టెంబర్ 03 (జనవాణి): గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. సెప్టెంబర్ 3న దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.3,333 పెరిగి రూ.1,55,350కి చేరింది.
గుడ్ రిటర్న్స్ ప్రకారం.. ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400గా నమోదైంది. ఇది నిన్నటితో పోలిస్తే రూ.3,020 పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,510కి చేరుకుంది.
నగరాల వారీగా బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,350, 22 క్యారెట్ల ధర రూ.1,42,400గా ఉంది. బెంగళూరులోనూ ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,500, 22 క్యారెట్ల ధర రూ.1,42,550గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,52,010గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,39,340గా నమోదైంది.

వెండి ధరల్లోనూ మార్పులు
వెండి ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,49,900గా ఉంది. బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉంది. బెంగళూరు, ఢిల్లీలో నిన్నటి రూ.2.45 లక్షలతో పోలిస్తే కిలోకు రూ.5 వేల పెరుగుదల నమోదైంది.
ఎందుకు పెరిగాయి?
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనపడటం, అమెరికా బాండ్లపై రాబడులు తగ్గడం వంటి పరిణామాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచినట్లు తెలుస్తోంది. దీంతో వరుసగా మూడు రోజులుగా తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పైకి కదిలాయి.




















