అఖిల్ అక్కినేనికు 'లెనిన్' సినిమా కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇదే నెల 10వ డేట్‌కు భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. మంచి కమర్షియల్ సినిమా, ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా ఒక్క సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడే అని ఫీలయిపోతున్న అక్కినేని అభిమానులకు మురళి కిషోర్ అబ్బూరి మర్చిపోలేని హిట్టు ఇచ్చాడు. డే1 నుంచే సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా దుమ్మురేపే రేంజ్‌లో వచ్చాయి.
ఫస్ట్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.16 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అయ్యగారి కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వచ్చింది. అయితే.. ఈ సినిమాతో అయ్యగారు రూ.100 కోట్ల క్లబ్‌లో పక్కా నిలుస్తాడు అటు ఫ్యాన్స్.. ఇటు జనరల్ ఆడియెన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. దానికి కారణం ఈ సినిమాకు వచ్చిన డీసెంట్ టాక్.
అయితే.. ఇప్పుడున్న టైమ్‌లో అది కష్టమే అనిపిస్తుంది. ఈ వారం రిలీజైన చెన్నై లవ్ స్టోరీ సినిమా లెనిన్‌కు గట్టి పోటినిస్తుంది. రెండు వారాల ముందు రిలీజైన ది ఒడిస్సీ మూవీ కూడా ఎంతో కొంత ఈ సినిమాపై కలెక్షన్ల ప్రభావం చూపించింది. ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పిన నెంబర్స్ ప్రకారం.. ఈ సినిమాకు రూ.88 కోట్ల గ్రాస్ వచ్చినట్లు జూలై 20న ఓ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత చడి చప్పుడు లేదు. పోనీ ఫేక్ పోస్టర్ వేద్దామా అంటే 8 రోజుల్లో ఇంత రసవత్తర సినిమాల పోటీ మధ్య రూ.12 కోట్లు వచ్చిందటే ఎవరూ నమ్మరు. ఇలా మొత్తంగా చూసుకుంటే.. లెనిన్ సినిమా వంద కోట్ల క్లబ్ ఆశలు కనుమరుగైనట్లే.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాయలసీమలోని రామాపురం ఒక ప్రశాంతమైన గ్రామం. అక్కడ ఎప్పుడూ పగలు, ప్రతీకారాలు అనేవి ఉండవు. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి పదేళ్ల అనాథ 'లెనిన్' అడుగుపెడతాడు. ఆ ఊరిలో ఉండే ఓ పెద్దావిడ (ఈశ్వరీరావు) ఆతనని ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. ఆ పెద్దావిడ కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో లెనిన్‌కు ప్రాణస్నేహం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి మెలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే కొన్ని అనుకోని పరిణామాల వల్ల లెనిన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అలా కొన్నేళ్లు గడిచాక అతను మళ్లీ ఊరికి తిరిగి వస్తాడు. కానీ వచ్చాక ఊహించని విధంగా తన ప్రాణ స్నేహితుడైన వసంత్‌తో సహా ఊరిలోని వంద మందిని అతి దారుణంగా హతమారుస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ నేలపై లెనిన్ ఎందుకు అంత పెద్ద రక్తపాతం సృష్టించాడు? స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి చివరికి నమ్మకద్రోహానికి ఎలా బలయ్యాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే 'లెనిన్' సినిమా కథ.




















