ఆగస్టు 7న గద్వాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న జోగుళాంబ గద్వాల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు.

4 ఆగస్టు, 2026 10:51 PM•ByRalin

Share this article

ఆగస్టు 7న గద్వాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

గద్వాల, ఆగస్టు 4 (జనవాణి): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న జోగుళాంబ గద్వాల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించడంతో పాటు చేనేత నడకను ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా చేనేత వస్త్రాల వినియోగం, చేనేత కళల పరిరక్షణ, సంప్రదాయ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా చేనేత కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.

సహజ నారతో తయారయ్యే చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మానికి అనుకూలంగా ఉండి హుందాతనాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు విస్తృతంగా చేనేత వస్త్రాలను వినియోగించి చేనేత రంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో "తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం – భవిష్యత్ అవకాశాలు" అంశంపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కార్యక్రమంలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలోని చేనేత, ఉన్ని, సిల్క్ సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జాతీయ చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సహాయ సంచాలకులు ఇందిర కోరారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు