వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే!

వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వెంట వస్తాయి. ఈ సీజన్‌లో ఏ ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యంపై ఏదోలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ డైట్‌లో ఈ ఆరు సూపర్‌ ఫుడ్స్‌ను చేర్చుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

28 జులై, 2026 4:38 PM•ByRamchandram

Share this article

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే!

వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వెంట వస్తాయి. ముఖ్యంగా కలుషిత నీరు, నిల్వ చేసిన ఆహారం, పరిశుభ్రత లేని ఆహార పదార్థాల కారణంగా జీర్ణసంబంధిత సమస్యలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో ఏం తిన్నా అవి మన ఆరోగ్యంపై ఏదోలా ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే పేగుల ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలను ఎంచుకోవడంతో పాటు ఆహార పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో ఎందుకు జీర్ణ సమస్యలు ఎక్కువ?

వానాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల ఆహారపదార్థాల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం, సరిగ్గా శుద్ధి చేయని నీరు, పరిశుభ్రత లేని స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్, విరేచనాలు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండలని వైద్యులు చెబుతున్నారు. పలు ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

1. పెరుగు

తాజా పెరుగులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వర్షాకాలంలో రోజూ ఒక కప్పు తాజా పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బయట షాపులో కొనుక్కొచ్చిన పెరుగు కంటే కూడా.. ఇంట్లో తయారుచేసుకున్న తాజా పెరుగు తినడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నాయి.

2. ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారం

పులియబెట్టిన పిండితో తయారు చేసిన ఇడ్లీ, దోశ వంటి ఆహారాల్లో ప్రయోజకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే పరిశుభ్రంగా తయారుచేసినవే తీసుకోవడం మంచిది.

3. అరటిపండ్లు

ఏ సీజన్‌లో అయినా సరే దొరికే అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పెక్టిన్, ప్రీబయాటిక్ ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టే విరేచనాల తర్వాత కోలుకుంటున్న వారిని కూడా వీటినే తినాలి వైద్యులు చెబుతుంటారు

4. అల్లం

జీర్ణక్రియను మెరుగుపరచడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. వికారం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమ్యలను తగ్గించడంలోనూ అల్లం దోహదపడుతుంది. కాబట్టి ఈ మాన్‌సూన్ సీజన్‌లో ప్రతిరోజూ అల్లం టీ తాగినా, లేదా వంటల్లో అల్లం వాడినా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

5. ఖిచిడీ

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నప్పుడు నూనె ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం బదులు పెసరపప్పు ఖిచిడీ తీసుకోవడం బెటర్. ఇది తేలికగా జీర్ణమవ్వడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.

6. బాగా ఉడికించిన కూరగాయలు

సోరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, క్యారెట్ వంటి కూరగాయాలను బాగా ఉడికించి తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. పచ్చి కూరగాయల కంటే కూడా ఉడికించిన కూరగాయలే ఈ వర్షాకాలంలో సురక్షితమని వైద్యులు చెబుతున్నారు.

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • శుద్ధి చేసిన లేదా మరిగించిన నీటిని తాగాలి.

  • వేడి వేడి, తాజాగా వండిన ఆహారమే తీసుకోవాలి.

  • ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం తినకూడదు

  • పండ్లు, కూరగాయలను బాగా కడిగి వాడుకోవాలి.

  • రోడ్డు పక్కన దొరికే జ్యూస్‌లు, చాట్, పానీపూరి, స్ట్రీట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

  • ఎక్కువ నూనె, మసాలా ఫుడ్ తగ్గించాలి.

  • వీలైనంత వరకు కాచి చల్లార్చిన నీటినే తాగాలి.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు