Telangana Bonalu Festival 2026 Dates: బంగారు బోనంతో బోనాల జాతర ప్రారంభం.. ఆగస్టు 3 న రంగం!

Bonalu Festival 2026: తెలంగాణ రాష్ట్ర పండుగ, సాంస్కృతి వైభవానికి ప్రతీక అయిన ఆషాఢ మాసం బోనాలు జాతర సంబరాలు మొదలుకానున్నాయ్. ఈ ఏడాది ఆషాడ మాసం జూలై 15న ప్రారంభమై..ఆగష్టు 12 తో ముగియనుంది.

24 జూన్, 2026 4:54 AM•ByNarender Kumar Nangunoori

Share this article

Telangana Bonalu Festival 2026 Dates:  బంగారు బోనంతో బోనాల జాతర ప్రారంభం.. ఆగస్టు 3 న రంగం!

Bonalu Festival 2026 Dates: ఆషాఢ మాస బోనాల జాతర సంబురాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15న ప్రారంభమై ఆగష్టు 12తో ముగియనుంది. జూలై 19 ఆదివారం గోల్గొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జూలై 26 ఆదివారం జరగనున్నాయి. పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళి బోనాలు ఆగష్టు 2న జరగనున్నాయి. ఆగష్టు 3న రంగం జరగనుంది. నెల రోజుల పాటూ జరగనున్న ఈ వేడుకలు ఆగష్టు 10తో ముగియనున్నాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

బోనాలు ఉత్సవాల్లో కీలక ఘట్టాలు ఆగష్టు తొలివారంలో జరగనున్నాయి. ఆగష్టు 2న ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటూ ప్రధాన ఆలయాల్లో అమ్మవారికి భారీ ఎత్తున బోనాలు సమర్పించనున్నారు. ఆగష్టు 3 సోమవారం భవిష్యవాణి నిర్వహిస్తారు. ఆ తర్వాత అంబారీపై అమ్మవారిని సాగనంపేందుకు ఉరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. ఆగష్టు 10న ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఆషాఢ బోనాల జాతర ముగుస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బోనాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా , ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, విద్యత్ సహా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 10న అధికారిక బోనాల సందర్బంగా సెలవు ప్రకటించింది.

గోల్కొండ, ఉజ్జయిని, మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా మహంకాళి వంటి ప్రధాన ఆలయాల్లో భారీ ఊరేగింపులు, బోనం సమర్పణలు, పోతురాజుల విన్యాసాలు జరుగుతాయి. అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే భోజనమే బోనం.

బోనాలు పండుగ వెనుక కథ:

1813లో ప్లేగు వ్యాధి నుంచి రక్షణ కోరుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జంటనగరాల్లో భయంకమైన ప్లేగు వ్యాపించి వేలమంది ప్రాణాలు కోల్పోవడంతో..ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఓ సైనిక బెటాలియన్ ఉజ్జయినిలో ఉంది. అక్కడ అమ్మవారికి ప్రార్థనలు చేసి ప్లేగు నుంచి ప్రజలు రక్షణ పొందితే ఆమె విగ్రహాన్ని సికింద్రాబాద్ లో ప్రతిష్టించి పూజిస్తా అని ప్రతిజ్ఞ చేశారు. ప్లేగు తగ్గిన తర్వాత సైనికులు తిరిగి వచ్చి ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్ లో నిర్మించి విగ్రహం ప్రతిష్టించారు. ఆమెకు బోనం సమర్పించడం ద్వారా కృతజ్ఞతా ఉత్సవం మొదలైంది. ఇదే బోనాలు సంప్రదాయానికి మూలం. అన్నం, పాలు, పసుపు, వేపాకు, కుంకుమతో అలంకరించిన బోనం అమ్మవారికి సమర్పిస్తారు.

బోనాలు సంప్రదాయ కాకతీయుల కాలం నుంచి ఉందని చరిత్రకారులు చెబుతారు. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీ కృష్ణ దేవరాయలు కూడా అమ్మవారికి బోనం సమర్పించారని చెబుతారు. గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి ఆలయంలో కాకతీయుల నుంచి కుతుబ్ షాహీల వరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. నిజాం పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో బోనాలు వైభవంగా నిర్వహించేవారు. ఇది ముఖ్యంగా గ్రామదేవతల పూజా సంప్రదాయ. వ్యాధులు, కరువు, సమస్యల నుంచి రక్షణ కోసం అమ్మవారికి కృతజ్ఞతలు చెల్లించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం ఉత్సవం కాదు.. తెలంగాణ స్త్రీ శక్తి, భక్తి, సంస్కృతి, సమాజ ఐక్యతకు ప్రతీక.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు