ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు దివంగత కాకా వెంకటస్వామి కన్న కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు, ప్రభుత్వ వైద్య సేవలు, ఓటర్ల జాబితా సవరణ, తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.
ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సోమవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నవజాత శిశువుల ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఊపిరాడక ముగ్గురు పసికందులు మృతిచెందారు. మరో చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా జర్నలిస్టులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరోగ్య పథకం హామీ అమలు కాకపోవడం విచారకరమని TUWJ రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కూడా ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలోని టిపేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లోకి పులుల కదలికలు పెరిగాయి. భీంపూర్ మండలం అర్లి గ్రామంలో వ్యవసాయ పొలాల్లో పులి కనిపించగా.. మరో పులి కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అడుగుజాడల ద్వారా గుర్తించారు.
ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ మోసాలపై ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఏపీకే ఫైళ్లు, తెలియని లింకులు, లోన్, వర్క్ ఫ్రం హోం, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వారంలో 38 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి.
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఆధార్, ఓటర్ ఐడీ పాన్‌కార్డులతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆదిలాబాద్‌లో ఈ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామికాభివృద్ధి, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ మట్కా నిర్వహణకు పాల్పడిన వ్యక్తికి రూ.15 వేల జరిమానా విధించారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసుల నివేదిక ఆధారంగా అర్బన్ తహసీల్దార్ ఈ చర్యలు తీసుకున్నారు.