
దేవుడిగా గాంధీజీ..ఇక్కడ బాపూజీకి నిత్య పూజలు
సాధారణంగా దేవుళ్లకు ఆలయాలు నిర్మించి పూజలు చేస్తుంటాం. అయితే స్వాతంత్య్ర సమరయోధుడైన మహాత్మా గాంధీకి కూడా ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్న ప్రాంతం తెలంగాణలో ఉంది.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nalgonda.

సాధారణంగా దేవుళ్లకు ఆలయాలు నిర్మించి పూజలు చేస్తుంటాం. అయితే స్వాతంత్య్ర సమరయోధుడైన మహాత్మా గాంధీకి కూడా ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్న ప్రాంతం తెలంగాణలో ఉంది.

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు స్థానాలకూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఎంపిక చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.

తెలంగాణలోని మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుగా నమోదుకు అర్హులైన వారు Form-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా తాజా జాబితాలో చేరేందుకు మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

తెలంగాణలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల జాబితా రూపొందించనున్నారు. నవంబర్ 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించిన అధికారులు.. గతంలో ఓటర్లుగా నమోదైన వారు సైతం ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు నల్లగొండ జిల్లాకు చెందిన వలిగొండ నరసింహ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో కూలీ, మేస్త్రీ పనులు చేస్తూనే చదువును కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి.. డాక్టరేట్ అందుకున్న స్థానానికి ఎదిగారు.

నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేయగా.. దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ల్గొండలో ప్రిన్సిపల్ దారుణ హత్య.. దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్ 27 కత్తిపోట్లు.. ప్రిన్సిపల్ హత్య వెనుక టెన్త్ విద్యార్థులేనా? స్కూల్‌కు వస్తూనే ఉన్నారు.. కానీ హత్య కేసులో అనుమానితులుగా విద్యార్థులు రూ.4 లక్షల కోసమే హత్య చేశారా?.. ప్రిన్సిపల్ కేసులో పోలీసుల దర్యాప్తు 80 మందిని విచారించిన తర్వాత కీలక మలుపు.. ముగ్గురు విద్యార్థులపై అనుమానం

నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శు

ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సాగర్‌లోకి ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశాలు కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు.

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.